హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:00 PM
హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని.. ఇప్పుడు కూడా వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని ధ్వజమెత్తారు.
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని... ఇప్పుడు కూడా వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని ధ్వజమెత్తారు. హెరిటేజ్ ఫిన్ లీస్1996లో స్థాపించిన సంస్థ అని చెప్పుకొచ్చారు. 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ స్థాపించారని ప్రస్తావించారు. ఇవాళ(బుధవారం)అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి లోకేశ్ చిట్‌చాట్ చేశారు.
మేము కలగన్నామా..?..
హెరిటేజ్ ఫిన్‌లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుందని.. అనేక ఇతర సంస్థల మాదిరిగానే వీఎస్ఆర్ కూడా ఫైనాన్స్ తీసుకుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, మహారాష్ట్ర దివంగత మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వీఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్‌కు గురవుతుందని తాము కలగన్నామా?, తాము ఏమన్నా జ్యోతిష్యులమా..? అని ప్రశ్నించారు. వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు మీడియాకు అందిస్తానని చెప్పుకొచ్చారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి తానెందుకు సమాధానం చెప్పాలి..? అని నిలదీశారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమున్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం తాము చెబుతామని పేర్కొన్నారు.
బొత్సాకి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..
చిల్లర దొంగలను పట్టుకొని.. గజ దొంగలను వదిలేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంటే జగన్ గజ దొంగ అని బొత్సా చెబుతున్నారా..?, జగన్‌ను పట్టుకోమని ఆయన చెబుతున్నారా? అని నిలదీశారు. సిట్ అధికారుల విచారణలో తేలిందంతా అదే కదా అని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తమపై ఆరుకు పైగా కేసులు పెట్టారని.. ఫైబర్‌నెట్, స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక, అసైన్‌మెంట్ భూములపై కేసులు పెట్టారని తెలిపారు.
గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదు..
చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంత్రులకు అయితే గవర్నర్.. ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదని, ఒక్క ఆధారమైన చూపారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ హయాంలో పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకు ఓ యూనివర్సిటీ పెట్టామని, రెసిడెన్షియల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు వారంతా పార్టీ కార్యాలయంలోనే ఓరియెంటేషన్ క్లాస్‌లో ఉండాలని సూచించారు. ఈ ఒరియేoటేషన్‌కి ప్రిన్సిపాల్ సీఎం చంద్రబాబు అని ప్రస్తావించారు. తాము అంతా విద్యార్థులమేనని.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే సమావేశాలు.. రాజకీయాలకు అతీతమని... ఫ్యామిలీ కాన్సెప్ట్‌లోనే ఇది జరుగుతుందని వివరించారు. ఈ భేటీలో రాజకీయ ప్రస్తావన లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..
Read Latest Telangana News And AP News And Telugu News