Share News

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..

ABN , Publish Date - Feb 23 , 2026 | 09:39 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(సోమవారం) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వివిధ శాఖల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సీఎం దిశానిర్దేశం చేశారు.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..
AP CM Chandra babu Naidu

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(సోమవారం) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా వివిధ శాఖల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమైన అంశాలపై సీఎం చర్చించారు.


ఉద్యోగుల పనితీరుకు రేటింగ్..

ఇకపై ఉద్యోగుల పనితీరును శాస్త్రీయంగా విశ్లేషించి వారికి వెయిటేజ్ ఇస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిచే అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం నుంచి అధికారికంగా అభినందన లేఖలు అందజేస్తారు. ఇది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని సీఎం ఆకాంక్షించారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చూడాలని, రోగులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్స్ (సంచార ప్రయోగశాలలు) అందుబాటులోకి తేవాలని, తద్వారా పలు వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలందించేలా ఆ శాఖకు సరికొత్త రూపు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి శాఖ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా అందిస్తున్న సేవలను సామాన్యులు కూడా సులభంగా వినియోగించుకునేలా ప్రత్యేక అవగాహన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 10:08 PM