Share News

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:10 PM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

ఢిల్లీ, జులై 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) ఈరోజు (బుధవారం) ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాల గురించి మీడియాకు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


ఈ రోడ్డు నిర్మాణానికి రూ.150 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించాలని మంత్రి సూచించారు. ప్రతిపాదిత రోడ్డు ప్రభుత్వ భూముల గుండా వెళ్తున్నందున భూసేకరణ సమస్య లేదని తెలిపారు. ఈ రోడ్డు పూర్తి అయితే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారుతుందని చెప్పుకొచ్చారు. పోర్ట్ ద్వారా ఎగుమతి, దిగుమతి, కంటైనర్ ట్రాఫిక్ ఊపందుకుంటుందని వెల్లడించారు.


మచిలీపట్నం ప్రాంతంలో ఇండస్ట్రీయల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, MSME క్లస్టర్‌లకు సానుకూలంగా మారుతుందని మంత్రి వివరించారు. మంగినపూడి బీచ్‌కు రోడ్డు సదుపాయం పెరిగితే పర్యాటకాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం నుంచి బంటుమిల్లి వరకు 20 కిలోమీటర్ల రోడ్డుకు ఆమోదం తెలపాలని విన్నవించారు. ఈ రోడ్డు పూర్తయితే పోర్టు, పారిశ్రామిక, పర్యాటక, లాజిస్టిక్స్ అభివృద్ధికి ప్రయోజనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 12:49 PM