Share News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Apr 14 , 2026 | 09:34 PM

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేశ్
AP Minister Kandula Durgesh

అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్టు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే ఈ పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. గోదావరి పుష్కరాలకు పది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని చెప్పుకొచ్చారు.


గోదావరి పుష్కరాల్లో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారని కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 09:50 PM