Share News

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:42 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని ధ్వజమెత్తారు.

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం
AP Minister BC Janardhan Reddy

అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మంత్రి జనార్దనరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష హోదా దక్కని వాళ్లు కూడా సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


పరిశ్రమలను తరిమికొట్టారు..

రప్పా, రప్పా అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా...? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఉన్న పరిశ్రమలను సైతం రాష్ట్రం నుంచి తరిమికొట్టారని ఆగ్రహించారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు వస్తున్నాయని వివరించారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి డిపాజిట్‌లు కూడా రావని మంత్రి బీసీ జనార్దనరెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత

ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 01:57 PM