Share News

ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:50 PM

మాజీ ఎంపీ నానిపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సెటైర్లు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి నాని రాసిన లేఖపై చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు
Kesineni Sivanath

విజయవాడ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ నానిపై (Nani) తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) సెటైర్లు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాని రాసిన లేఖపై చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నాని నిత్యం రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో కేశినేని శివనాథ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని మీడియాతో మాట్లాడారు.


ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారి నాని ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నారని శివనాథ్ సెటైర్లు గుప్పించారు. రేవులో తాడిచెట్టు మాదిరిగా పెరిగాడని.. కానీ కొంచెమైనా ఇంగిత జ్ఞానం మాత్రం లేదని వ్యంగ్యంగా అన్నారు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇరువురు ముఖ్యమంత్రులకు తనపై నాని ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. ఇక మిగిలింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్, కిమ్, కేఏ పాల్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. నాని వల్ల ఏం కాదని.. పక్కకెళ్లి ఆడుకో అని కేశినేని శివనాథ్ సెటైర్లు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్

‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 12:55 PM