Share News

పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం, అరాచకం సృష్టిస్తున్నారు: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:37 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం, అరాచకం సృష్టిస్తున్నారు: హోం మంత్రి అనిత
Vangalapudi Anitha

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పరామర్శల పేరుతో జగన్ సృష్టించిన విధ్వంసాన్ని వివరిస్తూ మీడియాకు అనిత ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన పర్యటనల్లో సృష్టించిన అరాచకాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. తన రాజకీయం కోసం పేదలను గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లలో జగన్ చేసిన పర్యటనలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పరామర్శల పేరుతో విధ్వంసం, అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన భూటకపు పరామర్శలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. మంచి, చెడు రెండింటిని ప్రజలు గమనిస్తారని తెలిపారు. ఈ రెండేళ్లలో రెండు వేర్వేరు నడవడిక ఉన్న నాయకులను ప్రజలు చూశారని చెప్పుకొచ్చారు.


చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు..

సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని హోం మంత్రి అనిత వ్యాఖ్యానించారు. సీఎం కృషితోనే పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్టు చేస్తోందని వెల్లడించారు. మరోవైపు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకం జరుగుతోందని ఆగ్రహించారు. ఆయన బయట అడుగుపెడితే మహిళలకు రక్షణ లేదని, సామాన్య ప్రజలు వ్యాపారాలు చేసుకోలేరని చెప్పుకొచ్చారు. పోలీసులను సైతం బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక పరామర్శ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తు మన బిడ్డలదని... మన చుట్టూ ఎలాంటి నాయకులు ఉన్నారో గమనించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షానికి ఉందని చెప్పుకొచ్చారు. ఆ పార్టీ నేతలు బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడగాలని.. తాము సమాధానం చెబుతామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనినైనా ఆయన చేస్తున్నారా ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు.


దిశా చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్లు పెట్టారు..

దిశాబిల్లు ఉపసంహరణపై హోం మంత్రి అనిత మాట్లాడారు. జగన్ హయాంలో దిశా చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్లు పెట్టారని, పోలీసులకు బాధ్యతలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ ఎక్యూప్‌మెంట్ కూడా వైసీపీ హయాంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ఎంతమంది వస్తారు, బారికేడ్లు ఎంత ఎత్తులో ఉండాలో పోలీసులే చెబుతారని అన్నారు. చట్టాలను గౌరవించేవారికి అవి వర్తిస్తాయని చెప్పారు. వారు నిబంధనలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించాలనే ఆయన బయటకు వస్తున్నారని మండిపడ్డారు. 2019కు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పి అరాచకం సృష్టించారని ఆగ్రహించా రు. శుక్రవారం వస్తే చాలు ఎవరిని జైల్లో పెడతారో తెలియని పరిస్ధితి వైసీపీ హయాంలో ఉందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చెప్పుకోవడానికి ఎన్ని పేజీలైనా సరిపోవని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు, ఉద్రేకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే తాము చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ రెండేళ్లలో ప్రశాంతంగా ఉన్నారా..? లేదా..? అని ప్రశ్నించారు. జగన్ వెనుక ఉన్నది జన్‌జీలు కాదని.. గంజాలు అని ఎద్దేవా చేశారు.


జగన్‌‌కు అర్హత మేరకే సెక్యూరిటీ కల్పించాం..

జగన్‌‌కు అర్హత మేరకే సెక్యూరిటీ కల్పించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. డీఎస్సీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కోర్టులు చెప్పాయని ప్రస్తావించారు. అయినా ఏమీలేని దానికి డీఎస్సీని భూతద్దంలో జగన్ అండ్ కో చూపుతున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ అంటే భయమని విమర్శించారు. ఆ పార్టీ చేపట్టిన డీఎస్సీ ధర్నాలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారని నిలదీశారు. గొడ్డలి పార్టీ విన్యాసాలను చూసి రాష్ట్రం సిగ్గుపడుతోందని విమర్శించారు. భస్మాసురుడికి అహం తలకెక్కినట్లే జగన్ ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజల నాశనాన్ని కోరుకున్నారని ఆగ్రహించారు.


భస్మాసురుడికి పట్టిన గతే గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి పడుతుంది..

భస్మాసురుడికి పట్టిన గతే గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి పడుతుందని హోం మంత్రి అనిత సెటైర్లు గుప్పించారు. విజనరీ నాయకుడు చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ఆయన విధ్వంసం, అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పర్యటనల్లో సామాన్యుల జీవితాలను ఇబ్బంది పెట్టారని, వారి ఆస్తులను విధ్వంసం చేశారని మండిపడ్డారు. మిర్చి రైతుల పరామర్శ పేరుతో గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను తన బౌన్సర్లతో కొట్టించారని ఆగ్రహించారు. మిర్చి టిక్కీలను ఫ్యాన్ పార్టీ నేతలు దొంగతనం చేశారని ఆరోపించారు. పరామర్శ పేరుతో బల ప్రదర్శనలు చేసి.. రైతులను కొట్టి.. దొంగతనాలు చేస్తారా..? ఇదేం తీరు.? అని ప్రశ్నించారు. గంజాయి తాగండి... మహిళలను ఏడ్పించాలని జగన్ మోహన్ రెడ్డి జనాలకు చెప్పాలనుకుంటున్నారా..? అని ఎద్దేవా చేశారు. జగన్ సొంత బాబాయ్ హత్యలో ఆయన వ్యవహారించిన తీరు చూశారని తెలిపారు. తల్లిదండ్రులు యువతను గొడ్డలి పార్టీ కార్యక్రమాలకు పంపొద్దని హోం మంత్రి అనిత సూచించారు.


వార్తలు కూడా చదవండి...

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 06:03 PM