మురసు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:09 PM
తుఫాన్ బాధితలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా కల్పించారు. వారంలో వచ్చిన రెండు తుఫాన్‌లను ప్రభుత్వం యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ బాధితలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) భరోసా కల్పించారు. వారం వ్యవధిలో వచ్చిన రెండు తుఫాన్‌లను తమ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో ఈరోజు (బుధవారం) తుఫాన్ సహాయక చర్యలపై హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..
తుఫాన్‌ల ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు త్వరితగతిన సహాయం అందిస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో వెంటనే కేంద్ర బృందాలను పంపినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. మురసు తుఫాన్ ముప్పు ఎదుర్కొన్న 7 జిల్లాల్లోని 465 గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల వేళ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
పొంగుతున్న వాగులను దాటవద్దు..
కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24 గంటలూ పరిస్థితులను పర్యవేక్షించాలని హోంమంత్రి సూచించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, రహదారులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని హోంమంత్రి అనిత మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News