Share News

స్థానిక ఎన్నికల్లో వందకు వందశాతం కూటమి గెలవాలి: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:25 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కూటమి పార్టీలు గెలవాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల్లో వందకు వందశాతం కూటమి గెలవాలి: హోం మంత్రి అనిత
AP Home Minister Anita

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం కూటమి పార్టీలు గెలవాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anita) దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో తన నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అనిత సమావేశమయ్యారు. టీడీపీ సమన్వయ కమిటీ, క్లస్టర్, యూనిట్ సభ్యులతో స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.


ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించాలని అనిత ఆకాంక్షించారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. నాయకులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. నేతలు ప్రజలకు మరింత చేరువ కావాలని హోం మంత్రి అనిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 05:42 PM