బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
ABN , Publish Date - Apr 22 , 2026 | 07:25 PM
బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. విద్యాశాఖ అధికారుల తీరును తప్పుపట్టింది. యథాతథ స్థితిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
నంద్యాల అర్బన్ మండలం మూలసాగరం గ్రామంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన భూమిలో ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం కొంతభూమిని కేటాయించడంపై న్యాయస్థానం తప్పుపట్టింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మించడాన్ని సవాల్ చేస్తూ నంద్యాలకు చెందిన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ప్రదాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి
ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం
విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News