విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:47 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెంటనే స్పందించి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఈరోజు (మంగళవారం) అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhya Rani) వెంటనే స్పందించి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలు అస్వస్థతకు గురవడం ఫుడ్‌పాయిజన్ వల్ల కాదని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే అలసట, అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా గుర్తించారని మంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి జిల్లా అధికారులతో, పెదబయలు మెడికల్ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలపై ఆరా తీశారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే పిల్లలకు ఓఆర్‌ఎస్‌లు తాగించడంతో పాటు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని మంత్రికి అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించిన సుమారు పదిమంది విద్యార్థులు చికిత్స అనంతరం కోలుకుని హాస్టల్‌లో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. హాస్టల్లోనే మరో 48 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండాలని అధికారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News