Share News

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ నజీర్

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:49 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ నజీర్
AP Governor Abdul Nazeer Meets Pawan Kalyan

హైదరాబాద్, జులై 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) భుజం నొప్పితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి (రొటేటర్ కఫ్) శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్ విశాంత్రి తీసుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) ఈరోజు (గురువారం) పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.

PAWAN.jpg


అలాగే, పవన్ స్వగృహంలోని లైబ్రరీని గవర్నర్ నజీర్ సందర్శించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. రచయితలు, స్కాలర్స్, పబ్లిక్ పాలసీ నిపుణుల పుస్తకాలపై చర్చించారు. పవన్ అభ్యర్థనపై ఓ పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. ఆప్యాయంగా వచ్చి పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

PAWAN-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 04:53 PM