జగన్ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారు: మంత్రి పయ్యావుల కేశవ్
ABN , Publish Date - Jan 23 , 2026 | 09:55 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ భయాన్నే చూసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారని ఆరోపించారు.
పల్నాడు జిల్లా, జనవరి23(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ భయాన్నే చూసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారని ఆరోపించారు. వైసీపీ పాలనలోని ఐదేళ్లు ప్రజలు నరకయాతన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో పండుగ సంతోషం నింపిందని పేర్కొన్నారు.
చిలకలూరిపేటలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శుక్రవారం జరిగాయి. ప్రత్తిపాటి పౌండౌషన్ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఎడ్ల పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు వేడుకలకు మంత్రి పయ్యావుల కేశవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ హాజరయ్యారు. విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతి, వారసత్వానికి కొనసాగింపుగా ప్రత్తిపాటి పుల్లారావు ఎడ్ల పోటీలు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.
ఎడ్ల పందేలకు ఈ స్థాయిలో ప్రజానీకం హాజరుకావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎడ్ల పందేలు డబుల్ ఇంజిన్ సర్కార్‌ను తలపిస్తున్నాయని వివరించారు. చంద్రబాబు నాయకత్వంలోని మంత్రివర్గ సభ్యులందరం రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసే మొదటి కూలీలం మాత్రమేనని తెలిపార. ఈ ప్రభుత్వంలో మంత్రులు కూడా భాగస్వామిగానే ఉంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు టీమ్ 2029లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చేలా అహర్నిశలు శ్రమిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రత్తిపాటి కొనసాగించిన ఎడ్ల పందేల వారసత్వం భవిష్యత్‌లోనూ కొనసాగాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
Read Latest AP News And Telugu News