Share News

సోషల్ మీడియాలో అల్లర్లు సృష్టిస్తే కఠిన శిక్షలు తప్పవు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ABN , Publish Date - Apr 14 , 2026 | 03:22 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూప్‌లు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అల్లర్లు సృష్టిస్తే కఠిన శిక్షలు తప్పవు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta

అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూప్‌లు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమైన కంటెంట్‌తో పాటు, మతపరమైన సున్నితమైన అంశాలను కూడా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అసత్యాలు, ర్యూమర్లు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని వివరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, శాంతికి భగ్నం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.


తీవ్రమైన చర్యలు ఉంటాయి..

ఇప్పటికే 1549 కేసులు నమోదు చేసి 1344 మందిని అరెస్టు చేశామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరించారు. ఐటీ చట్టం, భారత న్యాయసంహితతో పాటు వ్యవస్థీకృత నేరం కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేపనిగా పోస్టులు పెడుతున్న కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూపులు త్వరలోనే తీవ్రమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని మందలించారు. అలాంటి వారి అకౌంట్లను బ్లాక్ చేస్తామని స్పష్టం చేశారు. ఆయా కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి విచారణ కూడా చేయిస్తామని, తప్పించుకున్న వారిపై కూడా ప్రొసీడింగ్స్ ఇస్తామని పేర్కొన్నారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ఓ సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్‌ను అడ్వాన్స్ టెక్నాలజీతో సిద్ధం చేశామని తెలిపారు. పౌరులు ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సమయంలో, షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 03:43 PM