Share News

అంతర్జాతీయ స్థాయిలోనూ ఆక్టోపస్ అగ్రగామిగా నిలవాలి: డీజీపీ

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:08 PM

దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆక్టోపస్ అగ్రగామిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆకాంక్షించారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రత్యేక దళాలైన అక్టోపస్, గ్రేహౌండ్స్ చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలోనూ ఆక్టోపస్ అగ్రగామిగా నిలవాలి: డీజీపీ
AP DGP Harish Kumar Gupta

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆక్టోపస్ అగ్రగామిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) ఆకాంక్షించారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రత్యేక దళాలైన అక్టోపస్, గ్రేహౌండ్స్ చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.ఈరోజు (శుక్రవారం) ఉండవల్లిలో, నులకపేటలో ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్‌లో రూ.8 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డీజీపీ పాల్గొని, మాట్లాడారు.


అక్టోపాస్‌కు సొంత ప్రాంగణం ఉండాలని చాలాకాలంగా భావిస్తున్నానని డీజీపీ తెలిపారు. ప్రత్యేక ప్రాంగణం లేకపోతే దళం సామర్థ్యాల అభివృద్ధికి పరిమితులు ఏర్పడతాయని వెల్లడించారు. రోజువారీ శిక్షణ, సాధన, నిర్దేశిత కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక స్థలం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంతంలో, పచ్చదనంతో కూడిన నులక పేట ఆక్టోపస్ ప్రాంగణం అందుకు ఎంతో అనువైనదని తెలిపారు. పోలీసు దళాల ఆధునికీకరణ నిధుల నుంచి ఆక్టోపస్‌కు మరిన్ని నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 10:47 PM