Share News

ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వసం చేస్తారా?.. పవన్ కల్యాణ్ సీరియస్

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:40 PM

పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ధ్వసం చేస్తారా?.. పవన్ కల్యాణ్ సీరియస్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan).. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారించాలని హుకుం జారీ చేశారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు.


చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు (సోమవారం) సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేసినట్లుగా తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రంలోపు వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.


ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరం..

ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడమనేది దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. ఆ చర్యలకు పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలకు ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియజేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 01:51 PM