Share News

మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:30 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ కల్పించడం అనేది భారతదేశ మహిళా సాధికారత దిశగా ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించాలి: సీఎం చంద్రబాబు
AP CM CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ కల్పించడం అనేది భారతదేశ మహిళా సాధికారత దిశగా ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, సుమారు 60% సీట్లు మహిళలకు దక్కాయని ప్రస్తావించారు.


రాష్ట్ర వాటాను కాపాడుతుంది..

సీట్లలో 50% పెరుగుదల ప్రతి రాష్ట్ర వాటాను కాపాడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. దక్షిణాది వాటా యథాతథంగా ఉంటుందని అన్నారు. 1971లో ఒక ఎంపీ 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారని ప్రస్తావించారు. నేడు ఆ సంఖ్య సుమారు 27 లక్షలు, మరిన్ని సీట్లతో ఇది సుమారు 18 లక్షలకు చేరుకుంటుందని వివరించారు.


గత తప్పులను పునరావృతం చేయొద్దు..

తద్వారా ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఇప్పటికే మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతూ ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. గత తప్పులను పునరావృతం చేయొద్దని, ఈ బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించడం అంటే మహిళలకు వారి హక్కును నిరాకరించడమేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 05:58 PM