ఆక్వా రైతుల చిరకాల సమస్యలకు సీఎం చంద్రబాబు పరిష్కారం
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:51 PM
ఆక్వా రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కరించారు. ఈ మేరకు మత్స్యశాఖ జీవో నంబర్-1756ను విడుదల చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పరిష్కరించారు. ఈ మేరకు మత్స్యశాఖ జీవో నంబర్-1756ను విడుదల చేసింది. ఆక్వా రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకెళ్లారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపట్టారు.
మత్స్యశాఖ విడుదల చేసిన జీవోపై ఆక్వా రైతు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజావేదికలో ఎమ్మెల్యే రామును.. ఆక్వా రైతులు ఈరోజు (శనివారం) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవోలోని నిబంధనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. గత ప్రభుత్వంలో పట్టించుకోని తమ సమస్యలకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం లభించిందని ఆక్వా రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News