మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ.. పంటల పరిశీలన
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:38 PM
మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) ఏరియల్ వ్యూ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) ఏరియల్ వ్యూ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో మురసు తుఫాన్ నష్టాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అనుకూల వాతావరణం లేకపోవడంతో సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పంటలను పరిశీలిస్తున్నారు. ఏరియల్ వ్యూ అనంతరం అమరావతి సచివాలయానికి చేరుకుని ఆర్టీజీఎస్ నుంచి మురసు తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News