Share News

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు
NDA Meeting Delhi

ఢిల్లీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే (NDA) కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశంపై జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కీలక కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు.


అదేవిధంగా కేంద్రప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.


ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర - రాష్ట్ర సంబంధాల బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం అంశాలు కూడా ఈ అజెండాలో ఉండే అవకాశముంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 03:32 PM