కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నైజేషన్: అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:08 PM
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నైజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లామని.. తమకు ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుందో వేచి చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా మీడియాతో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ప్రతిపక్షం అనేది ఒక హోదా..., అది సరిపడా సంఖ్యాబలం ఉంటేనే దక్కుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాని సభ్యులకు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఫ్లాట్స్ కేటాయించాలా.? అని ప్రశ్నించారు. ఈ విషయంపైనా ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అసెంబ్లీకి రాని వారు ఎమ్మెల్యేగా ఎందుకు..
ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపు జీఏడీపై తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అసెంబ్లీకి రాని వారు ఎమ్మెల్యేగా ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఒకే లిఫ్ట్ ఉన్నందున పెద్ద వయస్సు ఉన్న వారు కింది అంతస్తులు కోరుకునేవారని ప్రస్తావించారు. అమరావతిలో మాత్రం ఎక్కువ లిఫ్ట్‌లు అందుబాటులో ఉండటం, వెంటిలేషన్, కాలుష్యం తక్కువ తదితర కారణాలతో పెద్ద వయస్సు ఎమ్మెల్యేలు పై అంతస్తులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు..
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు చేపట్టామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆగస్టు 14, 15వ తేదీల్లో అసెంబ్లీలో చేసే అలంకరణను ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఎవరైనా వచ్చి అసెంబ్లీ ప్రాంగణాన్ని వీక్షించవచ్చని వివరించారు. పోలీసు బ్యాండ్‌తో పాటు సంస్కృతిక కార్యక్రమాలను.. ఆ రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహిస్తామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News