ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:08 PM
ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నపై కేంద్రం వివరించింది.
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల (Foreign Investment) ప్రవాహం కొనసాగుతోంది. లోక్‌సభలో లెక్కలతో సహా కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నపై కేంద్రం వివరించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కంటే కూటమి ప్రభుత్వ పాలనలో భారీగా విదేశీ పెట్టుబడులు పెరిగాయని కేంద్రం తేల్చిచెప్పింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో రూ.760 కోట్లుగా (92.13 మిలియన్ డాలర్లు) ఎఫ్‌డీఐలు ఉన్నాయని వెల్లడించింది. 2024-25 నాటికి 233.14 మిలియన్ డాలర్లకు విదేశీ ఈక్విటీ పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది.
2025 - 26 నాటికి ఏకంగా రూ.5,000 కోట్లకు పైగా (608.59 మిలియన్ డాలర్లు) ఎఫ్‌డీఐలు ఎగబాకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైసీపీ హయాంలో పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితి వల్ల పెట్టుబడుల ప్రవాహం వెనకబడిందని చెప్పింది. 2025 - 26లో లోహ పరిశ్రమల రంగంలో అత్యధికంగా 250.67 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఆహార శుద్ధి రంగంలో 107.30 మిలియన్ డాలర్లు, సిమెంట్ ఉత్పత్తుల రంగంలో 99.90 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. సర్వీసెస్, ఆర్‌అండ్‌డీ పరిధిలోనూ 2025-26లో 59.96 మిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదైనట్లు వెల్లడించింది.
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అనుకూల పారిశ్రామిక విధానాలు, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పెట్టుబడులు ఊపందుకున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వైసీపీ పాలన కంటే కూటమి హయాంలో ఎఫ్‌డీఐల రీసౌండింగ్ గ్రోత్... 92 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 608 మిలియన్ డాలర్లకు విదేశీ పెట్టుబడులు చేరాయని వివరించింది. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, వేగవంతమైన అనుమతులతో ఏపీ వైపు విదేశీ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయని పేర్కొంది. లోహ, ఆహార శుద్ధి, సిమెంట్ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్తలు కూడా చదవండి...
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News