డ్రైవర్ కేసులో మరో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:56 PM
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
కాకినాడ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు (YCP MLC Anantha Babu) కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో కీలక సాక్షులను డబ్బులతో ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అనంతబాబును నిన్న (శుక్రవారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలుగా భావించి, రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, తాజా పరిణామాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సాక్షుల భద్రత, న్యాయవ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలపై చర్చలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇకపై ఈ కేసులో దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, మరిన్ని వివరాలు బయటకు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్
బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ
Read Latest AP News And Telangana News And International News And Telugu News