Share News

జగన్ హయాంలో కల్తీ పాలపై ఎలాంటి చర్యల్లేవ్.... షర్మిల ధ్వజం

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:25 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ హయాంలో కల్తీ పాలపై ఎలాంటి చర్యల్లేవ్.... షర్మిల ధ్వజం
YS Sharmila

రాజమండ్రి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కల్తీ పాల బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జగన్ కేవలం బల ప్రదర్శనలు మాత్రమే చేస్తారని.. తన సైతాన్ సైన్యం కోసమే యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కల్తీ పాలపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఆయనకు పేదల కష్టాలు అవసరం లేదని అన్నారు. ఈరోజు(సోమవారం) రాజమండ్రిలో కల్తీ పాల ఘటన బాధితులను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.


రూ.25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలి..

కల్తీ పాల ఘటనలో మృతులకు ఒక్కొక్కరికీ ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని తెలిపారు. లైసెన్స్ లేకుండా సదరు వ్యాపారి పాలు పోస్తున్నారన్నారు. 11 సంవత్సరాలుగా ఇలాంటి పాలను ప్రజలకు పోస్తున్న ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం ఒకే ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారని.. సదరు అధికారి కూడా ఇక్కడ ఉండరని చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వాలు ధైర్యం కల్పించాలని అన్నారు. కల్తీ పాల ఘటన బాధితులను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు పరామర్శించలేదని షర్మిల ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు..

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 12:35 PM