Share News

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోతున్న వైసీపీ

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:14 PM

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోతున్న వైసీపీ
Kuppam YSRCP

చిత్తూరు జిల్లా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ మూకలు దౌర్జన్యాలు చేస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. కుప్పం మండలం నడుమూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ మూకల దాడిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చేందుకు ఫ్యాన్ పార్టీ మూకలు ప్రయత్నించాయి.


శాంతిపురం మండలంలోనూ అదే పరిస్థితిని వైసీపీ శ్రేణులు కొనసాగించాయి. శాంతిపురం మండలం కడపల్లి గ్రామంలో ఫ్యాన్ పార్టీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు వైసీపీ శ్రేణులు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఆ పార్టీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై గుంపులుగా వచ్చిన ఫ్యాన్ పార్టీ మూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలోనే పోలీసులపైకి వైసీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి దూసుకువచ్చాడు. అల్లరిమూకలను చెదరగొట్టి, అక్కడి నుంచి దూరంగా పోలీసులు పంపించి వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ

ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:05 PM