పల్లెపోరులో గొడ్డలి పార్టీ శవ రాజకీయం.. టీడీపీ నేతల ధ్వజం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:47 PM
పల్లెపోరులో గొడ్డలి పార్టీ శవ రాజకీయానికి తెరలేపింది. కుప్పంలో రాజేంద్ర అనే తెలుగుదేశం పార్టీ స్థానిక నేత మృతిచెందేలా వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫ్యాన్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పల్లెపోరులో గొడ్డలి పార్టీ శవ రాజకీయానికి తెరలేపింది. కుప్పంలో రాజేంద్ర అనే తెలుగుదేశం పార్టీ స్థానిక నేత మృతిచెందేలా వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫ్యాన్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిచెందిన రాజేంద్ర వైసీపీ కార్యకర్త అంటూ సిగ్గులేకుండా గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి దిగిందని ఆగ్రహించారు. దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న రాజేంద్ర వైసీపీ కార్యకర్త అంటూ సిగ్గు విడిచి వైసీపీ విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కుప్పం టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర వైసీపీ కార్యకర్త అంటూ గొడ్డలి పార్టీ ప్రచారంతో మృతుని కుటుంబ సభ్యులు విస్తుపోతున్నారని అన్నారు.
విధ్వంసంతో, హత్యలతోనైనా కుప్పంలో ఒక్క సర్పంచ్ పదవినైనా కైవసం చేసుకోవాలని కేడర్‌ను గొడ్డలి పార్టీ రెచ్చగొడుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఫ్యాన్ పార్టీ కుప్పం ఇన్‌చార్జి ఎమ్మెల్సీ భరత్ ప్రొద్బలంతో అరాచకాలకు శ్రేణులు తెగబడ్డామని దుయ్యబట్టారు. అలాగే, టీడీపీ కుప్పం సీనియర్ నేత చంద్రశేఖర్ ఇంటిపైనా వైసీపీ కేడర్ దాడులు చేసి, ఆస్తులను ధ్వంసం చేశాయని ఆగ్రహించారు. తమపై బురద జల్లడానికి చనిపోయిన టీడీపీ కార్యకర్త శవానికి వైసీపీ రంగులు అద్దుతూ గొడ్డలి పార్టీ దుర్మార్గానికి తెగబడిందని ధ్వజమెత్తారు. ఇంత దిగజారుడు రాజకీయాలు వైసీపీకి అవసరమా అంటూ అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు.
విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ తమ ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. విధ్వంసాలు సృష్టించడం... బాధితుల మాదిరిగా కలరింగ్ ఇవ్వడాన్ని వైసీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారని విరుచుకుపడ్డారు. ఇటీవల కడపలో సొంత పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరిని చంపించి... గంజాయి మత్తులో జరిగిన హత్యగా గొడ్డలి పార్టీ చిత్రీకరించిందని దుయ్యబట్టారు. సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను తొక్కించి, చంపేసి... ఆ మరణానికి కారణం తమ ప్రభుత్వమేనంటూ జగన్ అండ్ కో బుకాయించిందని మండిపడ్డారు. మాచర్లలో నవులూరి చెన్నారెడ్డి అనే వైసీపీ కార్యకర్తను హత్య చేసింది పిన్నెల్లి అనుచరుడని... ఆ హత్యను కూడా టీడీపీకి పులిమేలా గొడ్డలి పార్టీ ప్రయత్నం చేసిందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఈ వార్తలు కూడా చదవండి...
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News