జగన్, విజయసాయిరెడ్డి కలిసి ప్రజాధనాన్ని దోచేశారు: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:27 AM
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని తెలిపారు.
తిరుపతి, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని తెలిపారు. ప్రజాధనాన్ని దోచేసిన వ్యక్తి ఎందుకు పార్టీ పెడుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు (సోమవారం) తిరుపతిలో మంత్రి సత్యకుమార్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల్లో ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు.
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ క్రైంలు చేయడంలో పార్టనర్స్..
జగన్, విజయసాయిరెడ్డిలు ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచేశారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజాధనం కాబట్టి ఇద్దరూ ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ క్రైంలు చేయడంలో పార్టనర్స్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అక్రమ మద్యంతో 30వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది అనారోగ్యం పాలయ్యారని.. వీటన్నింటిపైన జగన్, విజయసాయిరెడ్డిలు సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నాయకత్వానికి కొత్త దిశ.. చంద్రబాబు- లోకేశ్ సమక్షంలో లీడర్‌షిప్ కాంక్లేవ్
పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ.. ఉప్పాడ తీర రక్షణకు కీలక చర్యలు
వంగవీటి రాధాను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News