టీటీడీ సహకారంతో ఆ జూపార్క్‌ను అభివృద్ధి చేయొచ్చు: అయ్యన్న
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:26 AM
టీటీడీ సహకారంతో తిరుపతిలోని జూపార్క్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జూపార్క్ అభివృద్ధికి టీటీడీ సహకారం కోరుతామని పేర్కొన్నారు.
తిరుపతి, జులై 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ సహకారంతో తిరుపతిలోని జూ పార్క్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) వ్యాఖ్యానించారు. జూపార్క్ అభివృద్ధికి టీటీడీ సహకారం కోరుతామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ వన్యప్రాణి - పర్యావరణ పరిరక్షణ అసెంబ్లీ కమిటీ ఈరోజు (గురువారం) తిరుపతిలోని ఎస్వీ జూపార్కును సందర్శించారు.
జూపార్క్‌లో ఓ మెక్కను ఆ కమిటీ అధ్యక్షుడు, స్పీకర్ అయన్నపాత్రుడు నాటారు. అనంతరం సమీక్ష సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని జూపార్క్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే సందర్శకులు రావడం లేదని తెలిపారు. ఆసియాలోనే తిరుపతి జూపార్క్ అతిపెద్ద విస్తీర్ణం కలిగిన ప్రాంతమని వెల్లడించారు. జూపార్క్ అభివృద్ధిపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో మా అబ్బాయి రాజ్యసభ ఎంపీ అయ్యారని అయన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News