Share News

చొక్కా మడతపెడితే భయపడతామా..?

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:28 PM

‘చొక్కా మడతపెడతా అంటే భయపడతామా..? రప్పా రప్పా అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని మాజీ సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

చొక్కా మడతపెడితే భయపడతామా..?
JC Prabhakar Reddy

  • జగన్‌పై మండిపడ్డ జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి(అనంతపురం): ‘చొక్కా మడతపెడతా అంటే భయపడతామా..? రప్పా రప్పా అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని మాజీ సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ఎన్నికల్లో అందరూ పోటీచేయాలని, లేకపోతే టికెట్‌ ఇవ్వనని మీ పార్టీవాళ్లను బెదిరించావు. నీ పులివెందులలోనే 65 ఎంపీటీసీలకు 64 ఏకగ్రీవం అయ్యాయి. నీ పరిస్థితి ఏమిటి..?’ అని ప్రశ్నించారు. తాడిపత్రిలో ఫయాజ్‌బాషాకు టికెట్‌ ఇచ్చి నట్టేట ముంచారని విమర్శించారు. ‘ఫయాజ్‌.. నువ్వు మంచోడివి. కానీ ఏదేదో మాట్లాడుతున్నావ్‌. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు తెలుసు. ప్రజలే తీర్పు ఇస్తారు’ అని అన్నారు.


jc-p.jpg‘మీరు ఆరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? జైలులో ఉండి నేను నామినేషన్‌ వేసి గెలిచాను. మేము తాడిపత్రి ప్రజల కోసం ధైర్యంగా పోరాడుతాం’ అని అన్నారు. తాడిపత్రి వక్ఫ్‌బోర్డు ఆస్తి ఇప్పటికీ రూ.64 లక్షలు ఉంది. మీ హయాంలో ఎంత అభివృద్ధి చేశారు..? ఎంత డబ్బు మిగిలింది?’ అని ప్రశ్నించారు. రమేష్‌ రెడ్డి అరాచకాలు, అన్యాయాలు అన్ని ఇన్ని కాదని, బుగ్గరోడ్డులో రెండు ఎకరాల భూమిని, మరోచోట 10 ఎకరాల భూమిని కాజేశాడని ఆరోపించారు.


వీఆర్‌ రామిరెడ్డి పార్టీని నమ్మి డబ్బులు కాజేసుకున్నాడని, ఇక్కడ నుంచి వెళ్లి ఎక్కడైనా చూసుకోవాలని సూచించారు. యల్లనూరు మండలం ప్రశాంతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, విద్యావంతులని పోటీల్లో నిలిపి మండలాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నామని అన్నారు. భోగాతి నారాయణరెడ్డి మంచి వ్యక్తి అని, కానీ అతని కుమారులు ప్రతాప్‌ రెడ్డి, నాగేశ్వరరెడ్డి విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తమ ఇంటిపక్కనే ఉంటూ, గన్‌ కనిపించేలాగా తిరుగుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వారికి గన్నులు ఇచ్చిందే తాము అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో

ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 12:28 PM