Share News

ఐడీబీఐ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు: ఎంపీ రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:57 AM

ప్రభుత్వ రంగ బ్యాంకులు అమ్మకానికి పెట్టే ఆస్తులు కావని.. దేశ నిర్మాణానికి ఉపయోగపడే సంస్థలని కేంద్రప్రభుత్వానికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా శుక్రవారం రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు.

ఐడీబీఐ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు: ఎంపీ రాహుల్ గాంధీ
MP Rahul gandhi

ఢిల్లీ, అక్టోబర్ 30: ప్రభుత్వ రంగ బ్యాంకులు అమ్మకానికి పెట్టే ఆస్తులు కావని.. దేశ నిర్మాణానికి ఉపయోగపడే సంస్థలని కేంద్రప్రభుత్వానికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా శుక్రవారం రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకును ఎందుకు విక్రయిస్తున్నారని కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.


కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ కంపెనీకి ఐడీబీఐను విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని ఆ లేఖలో ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏడేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న ఐడీబీఐ.. గత ఏడాది రూ.9 వేల కోట్లకుపైగా లాభాలు ఆర్జించిందని తెలిపారు. ఈ బ్యాంకును లాభాల బాట పట్టించింది.. అందులోని ఉద్యోగుల కష్టమేనని చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకారణను వ్యతిరేకిస్తున్న సిబ్బందికి రాహుల్ గాంధీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. బ్యాంక్ ఉద్యోగుల పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు.


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ చేతుల్లో 95 శాతం ఐడీబీఐ వాటాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విక్రయం తర్వాత ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటా 34 శాతానికి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటా కొనసాగిస్తామని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడతాయని ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘ఆర్నబ్’ తుపాను బాధితులకు తక్షణ సాయం అందించండి: ప్రభుత్వాలకు రాహుల్ విజ్ఞప్తి

ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు స్వరం సిద్ధం

For More National News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 01:24 PM