‘ఆర్నబ్’ తుపాను బాధితులకు తక్షణ సాయం అందించండి: ప్రభుత్వాలకు రాహుల్ విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:04 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన విధ్వంసంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తుపాను కారణంగా.. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్ర పరిస్థితులపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ, అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన విధ్వంసంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తుపాను కారణంగా.. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్ర పరిస్థితులపైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం అందించాలని, బాధితులకు వేగంగా పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు.
బాధితులకు అండగా నిలవాలి: కేడర్‌కు ప్రియాంక సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆర్నబ్’ తుపాను కారణంగా తీవ్ర నష్టం ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ సంఘీభావం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ఒడిశా ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
బాధితులకు సాధ్యమైనంత మేర సహాయం అందించాలని పార్టీ కార్యకర్తలకు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. సహాయక చర్యలు, రక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు బాధితులకు అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు ఎంపీ ప్రియాంక గాంధీ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు స్వరం సిద్ధం
ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు
For More National News And Telugu News