ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:00 AM
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ మహార్యాలీని ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ మహార్యాలీని ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు కీలక ప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లారు. ఇక తెలంగాణ నుంచి వేలాది మంది కార్యకర్తలను ఈ ర్యాలీకి తరలించేందుకు దాదాపు 100కు పైగా బస్సులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మరికాసేపట్లో ఈ బస్సులు ఢిల్లీకి బయలుదేరనున్నాయి.
అయితే ఈ ర్యాలీకి తెలంగాణ నుంచి దాదాపు 10 వేల నుంచి 15 వేల మంది కార్యకర్తలను ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను టీపీసీపీ కోరింది. అందుకు దక్షిణ మధ్య రైల్వే అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు వందలాది మంది కార్యకర్తలు సికింద్రాబాద్‌లోని రైలు నిలయం వద్ద నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఢిల్లీకి కార్యకర్తలను తరలించేందుకు దాదాపు 100కి పైగా ప్రత్యేక స్లీపర్ బస్సులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది.
నవంబర్ 1వ తేదీ ఆదివారం రాంలీలా మైదానంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఇండియా కూటమి ఈ మహార్యాలీని నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అక్రమాలు, ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడమే ఈ ‘ఛలో ఢిల్లీ’ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కార్గో షిప్.. సిబ్బందిని రక్షించిన కోస్ట్‌గార్డు
For More TG News And Telugu News