అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కార్గో షిప్.. సిబ్బందిని రక్షించిన కోస్ట్‌గార్డు
ABN , Publish Date - Oct 30 , 2026 | 07:26 AM
ఆర్నబ్ తుపాన్ బీభత్సం కారణంగా అంతర్వేది సముద్ర తీరానికి సింగపూర్‌కు చెందిన సిగ్మా పేరల్ కార్గో షిప్ కొట్టుకొచ్చింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. షిప్‌లో చిక్కుకున్న 20 మందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.
అమలాపురం, అక్టోబర్ 30: ఆర్నబ్ తుపాన్ బీభత్సం కారణంగా అంతర్వేది సముద్ర తీరానికి సింగపూర్‌కు చెందిన సిగ్మా పేరల్ కార్గో షిప్ కొట్టుకొచ్చింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. షిప్‌లో చిక్కుకున్న 20 మందిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ షిప్‌ను సముద్రంలోకి మళ్లీంచాలా? లేక ఒడ్డుకు చేర్చాలా? అనే అంశంపై సింగపూర్ అధికారులతో కోస్ట్ గార్డ్ అధికారులు మాట్లాడుతున్నారు.
విశాఖపట్నం పోర్టులో సరుకు అన్‌లోడు చేసుకొని తిరిగి సింగపూర్‌కు వెళ్తుండగా.. ఈ షిప్ అంతర్వేదికి కొట్టుకొచ్చిందని వివరించారు. ఇంజన్ ఫెయిల్ కావడంతో ఈ షిప్130 నాటికల్ మైళ్లు కొట్టుకొచ్చిందని తెలిపారు. అంతర్వేది లైట్ హౌస్ సమీపంలో సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కార్గో షిప్ తేలియాడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News