Share News

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:05 AM

దేశంలోని నాగారాధన క్షేత్రాల్లో అతి పురాతనమైన కేరళ రాష్ట్ర ఆలప్పుళ జిల్లా హరిప్పాడ గ్రామం మణ్ణారశాలలోని శ్రీక్షేత్రంలో ఆయిల్యా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

బెంగళూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలోని నాగారాధన క్షేత్రాల్లో అతి పురాతనమైన కేరళ రాష్ట్ర ఆలప్పుళ జిల్లా హరిప్పాడ గ్రామం మణ్ణారశాలలోని శ్రీక్షేత్రంలో ఆయిల్యా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఏటా జరిగే ఈ మహోత్సవాలకు కేరళతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివస్తుంటారు. ఉత్సవాల్లో భాగంగా కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు నృత్యం, వాద్య సంగీతం, గేయాలాపాన తదితర విభాగాల్లో ప్రతిభావంతులకు శ్రీనాగరాజ పురస్కారాలు అందిస్తారు. ఆయిల్యా మహోత్సవంలో భాగంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్ణతం రోజు అక్టోబరు 31న శనివారం నుంచి ప్రారంభమవుతాయి. తదుపరి రెండ్రోజులు నిరంతరాయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:05 AM