Share News

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:26 AM

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోడ్‌ విషయమై కొంత గందరగోళం నెలకొన్నందున దాని పేరును మారుస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఓ ప్రకటన జారీచేసింది.

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

  • 21 నుంచి లొకేషన్‌ కోడ్‌కు సిటీ పేరు మార్పు

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోడ్‌ విషయమై కొంత గందరగోళం నెలకొన్నందున దాని పేరును మారుస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటివరకు ఆ విమానాశ్రయ వివరాల్లో వీటీజెడ్‌ కోడ్‌తో భోగాపురం సిటీ అంటూ అనుబంధంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు 21 నుంచి దాని కోడ్‌ వీటీజెడ్‌గానే ఉంచుతూ సిటీని భోగాపురానికి బదులుగా ‘విశాఖపట్నం’గా వ్యవహరిస్తామంది. టికెట్ల వెబ్‌సైట్లలో గందరగోళం లేకుండా ఈ మార్పు చేసినట్టు విమాన ప్రయాణికుల సంఘం తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 06:26 AM