Share News

ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:27 AM

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా పాంచజన్య సంకల్ప సభను తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) శుక్రవారం నిర్వహించనుంది. అమరవీరుల స్థూపం పక్కనే ఉన్న గ్రౌండ్‌లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు  సర్వం సిద్ధం

ఆదిలాబాద్, అక్టోబర్ 30: జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా పాంచజన్య సంకల్ప సభను తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) శుక్రవారం నిర్వహించనుంది. అమరవీరుల స్థూపం పక్కనే ఉన్న గ్రౌండ్‌లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 15 వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ పాంచజన్య సంకల్ప సభ ప్రారంభం కానుంది.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శ్రేణులను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. ఇప్పటికే నిజామాబాద్, మహబూబ్‌నగర్ (కోస్గి)లలో పాంచజన్య సంకల్ప సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అ క్రమంలో మూడో సభను ఇంద్రవెల్లి వేదికగా ఆ పార్టీ నిర్వహిస్తుంది. ఈ వేదికపై నుంచి పార్టీ పాంచజన్య సిద్ధాంతాన్ని వివరించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కరువుతోపాటు పలు అంశాలపై పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ బయలుదేరిన టీ కాంగ్రెస్ అగ్రనేతలు.. కార్యకర్తల కోసం 100కుపైగా బస్సులు

సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి

For More TG News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 11:06 AM