Share News

సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి

ABN , Publish Date - Oct 30 , 2026 | 08:05 AM

తన కుమారుడు మృతి కేసులో అసలు దోషులెవరో నిగ్గు తేల్చాలని సీబీఐ అధికారులకు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. తనకు కడుపుకోత మిగిల్చిన వారందరిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.

సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి
Gade Sai Krishna Mother Vijayalakshmi

అమరావతి, అక్టోబర్ 30: తన కుమారుడు మృతి కేసులో అసలు దోషులెవరో నిగ్గు తేల్చాలని సీబీఐ అధికారులకు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. తనకు కడుపుకోత మిగిల్చిన వారందరిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. సాయికృష్ణను ఎందుకు చంపారో మీరే తేల్చాలంటూ సీబీఐ అధికారులను వేడుకున్నారు. గాదె సాయికృష్ణ కేసులో కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.


ఈ క్రమంలో గురువారం ఏడో రోజు విజయలక్ష్మిని సీబీఐ అధికారులు విచారించారు. విజయవాడ ఆటోనగర్‌లో సీబీఐ కార్యాలయంలో ఆమెను విచారించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అయితే ఆమె విచారణ నిన్నటితో ముగిసింది. కానీ నేడు మరోసారి తమ విచారణకు రావాలని విజయలక్ష్మికి సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.


గాదె సాయికృష్ణ మృతి కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశాన వాటిక, పాడుబడిన భవనాన్ని సీబీఐ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అలాగే ఈ కేసులో పలువురు సాక్షులను కూడా వారు విచారించారు. ఇప్పటివరకు అరెస్టయిన వారే నిందితులా? ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కార్గో షిప్.. సిబ్బందిని రక్షించిన కోస్ట్‌గార్డు

నిమ్స్‌లో ఏసీబీ సోదాల కలకలం

For More AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 08:24 AM