Share News

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:01 PM

ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపింది.

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో
AP Pensions

అమరావతి, అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించింది. ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసేందుకు ఎస్‌ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లను పంపిణీ చేయాలని తెలిపింది. కొత్తగా ఎవరినీ పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. అదేవిధంగా పింఛన్ మొత్తాల్లోనూ ఎలాంటి మార్పులు చేయకూడదని వెల్లడించింది.


అధీకృత సిబ్బంది ద్వారానే నగదు ఉపసంహరణ జరగాలని.. వారే పెన్షన్లను పంపిణీ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఏమైనా వయోలేషన్స్ జరిగితే సహించేది లేదని హెచ్చరించింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ముఖ్య కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్.. భయాందోళనలో మాచవరం గ్రామస్తులు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 12:33 PM