ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:07 AM
ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలం పినపాక రోడ్డులో ఈరోజు ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలవగా.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 30: జిల్లాలోని జి.కొండూరు మండలం పినపాక రోడ్డులో ఈరోజు(శుక్రవారం) ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలవగా.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో మొత్తం 16 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు.. అక్కడకు చేరుకుని బస్సులో నుంచి పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
గాయాలైన డ్రైవర్, విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా చెవుటూరు, ఆత్కూరు గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి
నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం
Read Latest AP News And Telugu News