కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్.. భయాందోళనలో మాచవరం గ్రామస్తులు
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:02 AM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని పంట పొలాల్లో పైప్‌లైన్ నుంచి లీక్ అవుతుండటాన్ని స్థానికులు గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్టోబర్ 30: కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని పంట పొలాల్లో పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. గ్యాస్ లీకేజీపై సమాచారం అందిన వెంటనే ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈనెల 26న ఇదే ప్రాంతంలో గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. మళ్లీ అక్కడే మరోసారి గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. త్వరితగతిన ఈ లీకేజీని అదుపు చేయాలని, తరచూ గ్యాస్ లీకేజీలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం
ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Read Latest AP News And Telugu News