రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:44 AM
జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతానని స్పష్టం చేశారు. ‘నేను డంప్ యార్డు తీసేయాలని పాదయాత్ర చేస్తుంటే ఈటల రాజేందర్ పనిలేక తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారట.. ఈ డంప్ యార్డ్‌ను తొలిగించే వరకు మాత్రమే కాదు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా’ అంటూ వ్యాఖ్యానించారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు రీసైకిల్ కోసం ఎంత ఖర్చవుతుందో డీపీఆర్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీని ఒప్పించి అవసరమైన డబ్బులను తీసుకొస్తామని ప్రకటించారు. అలా తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు.
కాగా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ ఈనెల 27న ఏదులాబాద్‌లోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ డంపింగ్ యార్డు వల్ల వెలువడే కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు, కాలనీల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు. గాలి, భూగర్భ జలాలు కలుషితమయ్యాయని.. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం
ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు స్వరం సిద్ధం
Read Latest Telangana News And Telugu News