ఉపాధి అండగా.. పనులు మెండుగా..
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:44 AM
ఎల్‌నినో ప్రభావంతో ఊళ్లల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితులు, మండలాల్లో కరువు ఛాయలు నెలకొంటున్న నేపథ్యంలో పేద కుటుంబాలకు దక్కుతున్న పనులు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి.
జిల్లాల్లో రికార్డు స్థాయిలో కూలీల హాజరు
ఎల్‌నినో ప్రభావంతో ఊళ్లల్లో ఊపందుకున్న వీబీ జీరాంజీ పనులు
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
ఎల్‌నినో ప్రభావంతో ఊళ్లల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితులు, మండలాల్లో కరువు ఛాయలు నెలకొంటున్న నేపథ్యంలో పేద కుటుంబాలకు దక్కుతున్న పనులు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి. యాసంగి సీజన్ లో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణం లో వీబీ జీరామ్‌జీ పనులు ఆర్థిక భరోసాను కల్పిస్తు న్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27న రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు చేరువగా (3,97,910) కూలీలు పను లకు హాజరైన తీరే ఇందుకు నిదర్శనం.
ఈ ఒక్క నెలలోనే ఇప్పటికే 60 లక్షలకుపైగా పని దినాలను కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో వికసిత్ భారత్ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ)లో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో మరిన్ని కొత్త పనులను ఎంపిక చేయడం కూలీలకు వరంగా మారింది. ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేం దుకు గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను గ్రామ స్తులే ఎంపిక చేయడంతో ఉన్న ఊళ్లో ఉపాధిని పొందే అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో ప్రతినిత్యం పనిప్రదేశాలకు వెళ్లే కూలీల సంఖ్య అన్ని జిల్లాల్లో పెరిగింది.
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
గతంతో పోలిస్తే ఈ నెలలో ఉపాధి పనులకు ఊళ్లల్లో డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ పనులు తగ్గుతుండడంతో గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ఉపాధి పనుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచే పనులు, కందకా లు, వాన నీటి సంరక్షణకు సంబంధించి నిర్మాణాలు మొదలగు పనులకు కూలీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మొక్కల పెంపకం, మౌలిక వసతుల కల్ప న దిశగా జాబ్‌కార్డు కలిగిన వారికి పని దక్కేవిధంగా ఉపాధి హామీ సిబ్బంది ప్రతి నిత్యం పర్యవేక్షణ పెం చుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర పభ్రుత్వాలు ఉపాధికి ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లు రోజువారీగా కూలీల సంఖ్యను పెంచేందుకు క్షేత్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోలను పనుల తీరుని గమనించడంతోపాటు కూలీల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలనే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల్లో ఉపాధి పనుల పండుగ వాతావరణం నెలకొంది.
ఈనెల 25న ఆదివారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు 25,525 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా రోజుల్లో సగటున రెండు లక్షలకు పైగా కూలీలు హాజరవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగితే పల్లెల్లోని పలు కుటుంబాలకు దినసరి వేతనం రూపంలో కూలీలకు మరింత ఆర్థిక ఆసరా లభించే వీలుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News