Share News

మళ్లీ పెరిగిన మక్కల ధర

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:00 AM

వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర మళ్లీ పెరిగింది. తన చరిత్రను తానే తిరగ రాసింది.

మళ్లీ పెరిగిన మక్కల ధర
warangal Enumamula Market

  • ఏనుమాముల మార్కెట్‌లో క్వింటాలు రూ. 3255

వరంగల్‌: వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర మళ్లీ పెరిగింది. తన చరిత్రను తానే తిరగ రాసింది. గురువారం మార్కెట్లో మక్కలు క్వింటాల్‌కు రూ.3255 పలికింది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన రైతు ఉడుగుల నాగబాబు 66 బస్తాల మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చా రు. విజయ ట్రేడర్స్‌ కమీషన్‌ ఏజెంట్‌ ద్వారా ప్రేమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులు క్వింటాల్‌కు రూ.3255 చొప్పున కొనుగోలు చేశారు. దిగుబడి తగ్గి డిమాండ్‌ పెరగడం వల్లే మక్కలకు అధిక రేటు దక్కిందని చెబుతున్నారు.


hnk1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 11:00 AM