Share News

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

ABN , Publish Date - May 05 , 2026 | 01:49 PM

ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు.

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్
Cricket Betting

అనంతపురం, మే5 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ (IPL) సీజన్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురంజిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్ వేదికగా 'డ్రీమ్ ప్లే' (Dream Play) యాప్ ద్వారా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు పదిమంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి శివ అనే వ్యక్తి. అతడు ప్రస్తుతం ఫిలిప్పీన్స్ నుంచి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.


సిమ్ కార్డుల అక్రమ రవాణా..

ఇండియాలో సేకరించిన సిమ్ కార్డులను ఎవరికీ అనుమానం రాకుండా కార్గో జీన్స్ ప్యాంట్ల జేబుల్లో దాచి ఫిలిప్పీన్స్‌కు పంపేవారు. స్థానికులకు ఆశ చూపి, ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ. 10,000 చెల్లించి వారి పేర్లతో ఖాతాలు తెరిపించేవారు. నిందితులందరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై అంతర్జాతీయ స్థాయిలో ఈ నెట్‌వర్క్‌ను విస్తరించారు. ఫోన్ పే (PhonePe) లావాదేవీల ద్వారా బెట్టింగ్ సొమ్మును మళ్లించేవారు. పోలీసుల సోదాల్లో సుమారు రూ. 60 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 15 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 13 ATM కార్డులు, XUV 700 కారు, 4 బైకులు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి.


క్రికెట్ బెట్టింగ్ జోలికెళ్తే కఠిన చర్యలు: ఎస్పీ జగదీశ్

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడితే తప్పించుకోలేరని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ జోలికెళ్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ గేమింగ్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. బెట్టింగ్, గేమింగ్‌పై సాంకేతిక నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ ముఠాలు ఇలాంటి వినూత్న పద్ధతుల్లో యువతను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఇలాంటి యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జగదీశ్ సూచించారు


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu New

s

Updated Date - May 05 , 2026 | 01:56 PM