Share News

Rain Alert in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:43 PM

తెలంగాణ‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Rain Alert in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం
Rain Alert in Telangana

జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, సెప్టెంబరు 27: తెలంగాణ‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షం దంచికొడుతోంది. భారీ వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం ములుగుపల్లి- అంకుసాపూర్ గ్రామాల మధ్య వాగు పొంగుతోంది. ఈ క్రమంలో బైక్‌తో వాగు దాటేందుకు యత్నించాడు ఓ యువకుడు. వాగు దాటుతుండగా ద్విచక్రవాహనంతో సహా వాగులో కొట్టుకుపోయాడు సదరు యువకుడు. ఈత రావడంతో స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే వరదలో బైక్ కొట్టుకుపోయింది.


సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నిజాంపేట్- బీదర్ 161బీ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో నారాయణఖేడ్- బీదర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షం తగ్గేవరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.


తొగర్‌పల్లిలో పొంగుతున్న చెరువు...

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు కొండాపూర్ మండలం తొగర్‌పల్లి చెరువు పొంగిపొర్లుతోంది. చెరువుకు ఆనుకుని అవతలి వైపు సుమారు 45 మంది నివాసం ఉంటున్నారు. వారికి నిన్న(శుక్రవారం) రాత్రి నుంచి రవాణా, విద్యుత్ సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద పెరుగుతుండటంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. తమను వెంటనే కాపాడాలంటూ.. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పడవ సహాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత కుటుంబాలకు స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు నిర్మలా జగ్గారెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2025 | 07:45 PM