Bandi Sanjay VS Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:59 AM
నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
మంచిర్యాల, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎక్కువగా పెంచారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఉద్ఘాటించారు. ఇవాళ (సోమవారం) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సేవా భారతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. ప్రతి ఏడాది మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తోందని నొక్కిచెప్పారు. ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోందని గుర్తుచేశారు బండి సంజయ్.
మోదీ ప్రభుత్వంలో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని... ఎక్కడా ఉద్యోగాలు అమ్ముకోలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. కానీ ఫలితం లేదని విమర్శించారు. అక్రమాలు జరుగకుండా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేసే పాలకులు రాష్ట్రంలో లేరని ధ్వజమెత్తారు. గ్రూప్ వన్ కోసం ఎదురుచూస్తున్న అనేకమంది నిరుద్యోగుల ఏజ్ బార్ అయిపోయిందని బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News