Kavitha Fire On Revanth Govt: కాంగ్రెస్ కమీషన్ల సర్కారంటూ.. కవిత మళ్లీ ఫైర్
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:40 AM
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మండిపడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆడబిడ్డల చదువుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆడబిడ్డల చదువులను ఈ కాంగ్రెస్ కమీషన్ల సర్కారు కాలరాస్తోంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను రేవంత్ ప్రభుత్వం ఎగవేస్తుందని ఆమె ఆరోపించారు.
20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారంటూ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతోన్నాయని వివరించారు. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉంచుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే కాలేజీలు నడప లేక ఆర్థికంగా యాజమాన్యాలు చితికిపోయ్యాయని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలు మూతపడితే చదువుకు ఆడబిడ్డలు దూరం అవుతారని కవిత పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా కల్వకుంట్ల కవిత స్పందించారు.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి భారీగా జరిగిందంటూ రేవంత్ సర్కార్‌కు అందిన నివేదికలు స్పష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవినీతిలో బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ ప్రమేయం లేదని కవిత మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఈ అవినీతి చేసింది హరీశ్ రావుతోపాటు సంతోష్ రావు అంటూ ఆమె కీలక ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యలో ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్.. కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో ఆమె ఆ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె కొత్త పార్టీ స్థాపించి.. తద్వారా ప్రజల్లోకి వెళ్తారంటూ ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదీకాక.. ఇటీవల కాలంలో ఆమె ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పుతున్నారు. అందులోభాగంగా ధర్నా చౌక్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News