Nano Urea Benefits: ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ .. నానో యూరియా ప్రయోజనాలివే....
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:03 AM
రైతులకు ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తోంది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి చివరికి ఖాళీచేతులతో ఇంటికి చేరుతున్న పరిస్థితి. పంటల నిలువ, దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కమ్ముకుంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
బాసర, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు (Farmers) ప్రస్తుతం యూరియా (Urea) కొరత తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తోంది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి చివరికి ఖాళీచేతులతో ఇంటికి చేరుతున్న పరిస్థితి. పంటల నిలువ, దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కమ్ముకుంది. సాంప్రదాయ యూరియాపై రైతులు అలవాటు, అవగాహనలేమి కారణంగా మార్కెట్‌లో ఉన్న నానో యూరియాపై (Nano Urea) ఇంకా పూర్తిగా నమ్మకం కలగడం లేదు. నిజానికి ఒక్క బాటిల్ నానో యూరియానే ఒక సంచి సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్యాయం. పైగా తక్కువ ధర, సులభమైన రవా ణా, సమర్థవంతమైన వినియోగం లాంటి లాభాలు రైతులకు మేలుచేస్తాయని అధికారులు చెబుతున్నారు. అయినా రైతులు ఇంకా సాంప్రదాయ యూరియానే పట్టుకోవడంతో కొరత తీవ్రరూపం దాల్చింది. నానో యూరియాపై అవగాహన పెంచి, రైతుల నమ్మకం పెంచకపోతే ఈ యూరియా కష్టాలకు పుల్‌స్టాఫ్ పడేటట్లు కనిపించడం లేదు.
అరలీటర్... ఎకరానికి..
పంటకు నత్రజని అందించే యూరియా ఇప్పటి వరకు రైతులకు పరిచయం. ప్రతిపంట సాగులో యూ రియా ప్రధాన భూమిక పోషిస్తుంది. యూరియా లేకుండా వ్యవసాయం అనేది ఊహించలేము. అందుకే రైతుల జీవనంలో భాగంగా నిలిచింది. ప్రత్యామ్నాయం గా కనుక్కున్న నానో యూరియా రైతులకు వరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎకరానికి 45-50 కేజీల వరకు సాంప్రదాయ యూరియాను వేసినా, అం దులో కేవలం 30-40శాతం మాత్రమే పంటలకు అం దుతోంది. మిగతాభాగం వృథా అవుతూ నేల ఆరోగ్యం దెబ్బతినడం, నీటికాలుష్యం పెరగడం, వాయుకాలుష్యం సృష్టించడం జరుగుతుంది. రైతుజేబుకు కూడా బరువైపోతుంది. ఇక ఈ సమస్యలకు చెక్‌పెడుతూ శాస్త్రవేత్త లు రూపొందించిన నానో యూరియా వ్యవసాయ రం గంలో సంచలనంగా మారింది. కేవలం 500మిల్లీలీటర్ల ఒక బాటిల్‌తో ఎకరానికి సరిపోతుంది. ఆకులపై పిచికారి చేయగానే నానో కణాలు నేరుగా మొక్కలోకి చేరి 80శాతం వరకు నత్రజని శోషింపచేస్తాయని నిపుణు లు పేర్కొంటున్నారు.
తక్కువ శ్రమ... ఖర్చు
సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియాతో రైతుఖర్చులు గణీయంగా తగ్గుతాయి. 50కేజీ బస్తా రూ.170 వరకు ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి ఇంటికి నుంచి పొలానికి రవాణా కష్టంతో కూడుకున్న ది. అదే అరలీటర్ నానోయూరియా బాటిల్ ధర రూ. 100-130 వరకు ఉంది. రవాణా, ప్రయోగించడం సుల భం. ఎకరానికి 50 కేజీల ఎరువుకు బదులుగా కేవలం ఒక బాటిల్ సరిపోవడం వల్ల రవాణా, కార్మిక ఖర్చుల తగ్గించుకోవచ్చు. పర్యావరణానికి మేలు సాంప్రదాయ యూరియా వృథా అవడం వలన కలిగే కాలుష్యం తగ్గి పోతుంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూస్తాయి.
గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. వ్యవసాయరంగంలో నూతన శకంగా నిపుణులు సూచిస్తారు. పంట దిగుబడులు పెంచడమే కాకుండా ఖర్చు తగ్గించి రైతులకు రెండు విధాలుగా లాభం కలుగుతుందని పలువురు అధికారు లు అభిప్రాయపడుతున్నారు. నేలలో వేసే ప్రారంభ సమయంలో సంప్రదాయ యూరియా వాడుకొని మొక్కపెరిగిన తర్వాత మాత్రం నానో యూరియా వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు డీఏపీ, పొటా్‌షలు కూడా బస్తాలతో పోలిస్తే ద్రవరూపంలో అతి తక్కువ ధరలో లభిస్తున్నా యి. ఆసక్తి ఉన్న రైతులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలను వినియోగ పద్దతులు తెలియజేసే అవకాశం ఉంటుంది.
రైతులకు అవగాహన కల్పించాలి
నానోయూరియా గురించి తెలియక రైతులు సాంప్రదాయ యూరియాని మర్చి పోలేకపోతున్నా రు. విస్త్రృతంగా అవగాహన కల్పించాలి. గ్రామానికి కొంత భాగంలో నానో యూరియాతో ఉపయోగించి దాని ఫలితాలతో రైతులకు నమ్మకం కలిగించాలి. క్రమేపి రైతులు నానోవైపు అలవాటు పడే అవకాశం ఉంది.
- ఆనంద్ బండారి, కిసాన్ సంగ్ రైతుసంఘం నాయకులు, బాసర
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News