Kavitha on Jubilee Hills Election Strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:18 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై (Jubilee Hills Bye Election) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. తన ప్లాన్‌లో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ నుంచి ఓ అభ్యర్థిని బరిలోకి దింపాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థి అతనేనా..?
ఈ నేపథ్యంలో కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ(సోమవారం) ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అరగంటకు పైగా మంతనాలు సాగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వేడుకలకు ఆహ్వానం..
కాగా, కవితను కలిసిన అనంతరం విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు మాత్రమే కవితను ఆహ్వానించానని క్లారిటీ ఇచ్చారు. ఈ వేడుకలకు హాజరు కావాలని ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశానని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది బతుకమ్మ సంబరాల సందర్భంగా కవిత తన పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News