Share News

ACB inquiry ON Formula E scam Case: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:00 PM

ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.

ACB inquiry ON Formula E scam Case: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో  సంచలనం
ACB inquiry ON Formula E scam Case

హైదరాబాద్‌, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో (Formula E-Car Race Case) మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్‌ చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, గవర్నర్ అనుమతి అనంతరం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.


కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రాగానే వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. కాగా, ఇప్పటికే కేటీఆర్‌ను (KTR) నాలుగు సార్లు అరవింద్ కుమార్‌ను ఐదుసార్లు విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు. ఈ కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.


తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. కేబినెట్‌ అనుమతి లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో 19 డిసెంబర్‌ 2024న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ.54.88 కోట్లకుపైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి..

High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..ఎందుకంటే..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 09 , 2025 | 06:20 PM